PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పూర్వ విద్యార్థులు.. చేయూతనివ్వాలి

1 min read

– పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గురువులు
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ప్రస్తుత పేద విద్యార్థులకు పూర్వ విద్యార్థులు సహకరించాలని.. రిటైర్డ్ ఉపాధ్యాయులు నరసింహారావు, నర్సిరెడ్డి, ముకుందరావులు అన్నారు. ఆదివారం స్థానిక నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో 1986-87 పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఉపాధ్యాయులు.. మురళీమోహన్, ముకుందరావు, నర్సిరెడ్డి, నరసింహారావు లను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నూల్ మున్సిపల్ హై స్కూల్ పరిధిలో చదువుకొని ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులను వారు అభినందించారు. అలాగే ప్రస్తుతం పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పూర్వ విద్యార్థులు తమవంతుగా సహకరించాలన్నారు. పాఠశాలకు కావాల్సిన వస్తు పరికరాలు సమకూర్చాలని కోరారు. ముఖ్యంగా నెహురు మెమోరియల్ హైస్కూల్లో ఓపెన్ గ్రౌండ్ ను ఆధునికరించేందుకు సహకరించాలన్నారు. అనంతరం విద్యార్థులు తమ గురువులను ఉద్దేశించి మాట్లాడారు.. నాటి గురువులు అందించిన విద్య వల్లే నేడు ఈ స్థాయి చేరుకున్నామని పేర్కొన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సన్మానించి సత్కరించారు. కార్యక్రమం అనంతరం సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎం సాయి కుమార్ నాయుడు, చంద్రశేఖర్ సర్వేశ్వర్ గౌడ్, రాజేష్, సురేంద్ర, ఉస్మానియా కళాశాల లెక్చరర్స్ శివప్రసాద్, కరూర్ వైశ్యా బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ మల్లికార్జున, మెడికవర్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సంతోష్ వర్మ, స్కందాన్సీ మార్కెట్ జీఎం సుబ్రహ్మణ్యం శాస్త్రి, నాగోజి, బిక్షపతి, పుట్టా శ్రీనివాసులు, పుల్లయ్య, ప్రముఖ రచయిత లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author