బీపీ మండల్ ఆశయాలను నెరవేరుద్దాం
1 min read– వై. నాగేశ్వరరావు యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్
పల్లెవెలుగు,వెబ్ కర్నూలు: కర్నూలు బీసీ భవన్ నందు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీపీ మండల్ గారి విగ్రహ ఆవిష్కరణకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు తిమ్మయ్య యాదవ్ గారు, అయ్యన్న యాదవ్, ప్రదీప్ యాదవ్, లక్ష్మీకాంత్తయ్య, ధనుంజయ, శేషపని, వరుణ్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, రఘు యాదవ్, శ్రీరాములు యాదవ్, టీజీ మధు మరియు మధు మొదలైన నాయకులు పాల్గొని భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యుదయ రథసారథి బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్. బీసీల అభివృద్ధికి పునాదులు వేసిన మహనీయుడు బీపీ మండల్. దేశంలో 52 శాతానికి పైగా బీసీ జనాభా ఉన్నప్పటికీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో సమాన వాటా ఇచ్చినప్పుడే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని ఎలుగెత్తి చాటారు. కేవలం బీసీలనే కాకుండా మైనార్టీలు దళితులపై పోలీసులు చేస్తున్న అరాచకాలను ఎదిరించి బడుగుల పక్షపాతిగా నిలిచారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం సమాజం పట్ల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన బీపీ మండల్ విగ్రహఆవిష్కరణ కు కర్నూలు బీసీ భవన్ నందు భూమి పూజ చేయడం జరిగింది. బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణకు బీసీ జేఏసీ నాయకులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలనీ ఈ సందర్బంగా తెలియజేస్తున్నాం.