నష్టపోయిన పత్తి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కల్లూరు మండల కార్యదర్శి కృష్ణ అధ్యక్షతన,కల్తి పత్తి విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు, ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి కల్తీ విత్తనాలమ్మి రైతులను మోసం చేసిన కంపెనీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ,కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు కల్లూరు,గూడూరు,కర్నూలు మండలాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే ప్రభాకర్ రెడ్డి రైతు సంఘం నాయకులు జగన్నాథం, మాట్లాడుతూ,ఈ ఏడాది కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కొంతైనా మిగిలాయని ఆశపడిన పత్తి పంటలు, పూత రాక,కాయలు కాయక,పెరిగిన చెట్టు పెరిగినట్టే ఉండడం రైతులను ఇంకా,ఆందోళనకు గురి చేస్తుందని, పత్తి జిల్లాలో వేల ఎకరాల్లో వేశారని,దానికి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి దానినే, నమ్ముకున్న రైతులకు పెట్టుబడి చేతికి రాక, అల్లాడిపోతున్న పరిస్థితి ఉందని, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని పత్తి పంటకు ఒక ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి,కల్తీ పత్తి విత్తనాలు అమ్మిన కంపెనీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన గమనించిన వ్యవసాయ శాఖ జెడి గారు రైతుల దగ్గరికి వచ్చి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఇప్పటికే వ్యవసాయ భూముల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సర్వే చేయించామని,ఆ రిపోర్ట్స్ సాయంత్రానికి వస్తాయని, ఆ రిపోర్ట్స్ ఆధారంగా మీకు తగిన న్యాయం చేస్తామని,కల్తి విత్తనాలమ్మిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఆంజనేయులు సుంకన్న, మృత్యుంజయుడు, పర్ల గ్రామం ఎంపిటిసి సభ్యులు శేషన్న, తెలుగుదేశం కల్లూరు మండలం అద్యక్షుడు మార్కాపురం రామాంజనేయులు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా డివైఎఫ్ఐ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, నాగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.