విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం.. జిల్లా ఎస్పీ
1 min read– స్పందన కార్యక్రమానికి 134 ఫిర్యాదులు .
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 134 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) ఒమన్ దేశంలో మా అబ్బాయికి సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నకిలీ పత్రాలు చూపించి, డబ్బులు తీసుకొని ఒక వ్యక్తి మోసం చేశారని కర్నూలు గాంధీ టవర్స్ చెందిన ఫసీ ఉద్దీన్ ఫిర్యాదు చేశారు.
2) కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని మోసం చేశారని కర్నూలు గణేష్ నగర్ కు చెందిన నారాయణ ఫిర్యాదు చేశారు.
3) ల్యాండ్ సర్వే లైసెన్స్ ఇప్పిస్తామని చెప్పి ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని మోసం చేశారని కర్నూలు, సాయినగర్ కు చెందిన వీరన్న ఫిర్యాదు చేశారు.స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ గారు హామీ ఇచ్చారు.ఈ స్పందన కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఐపియస్ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్ , స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వెంకటాద్రి పాల్గొన్నారు.