లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేత
1 min read– సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: ప్రజల వద్దకే పాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని తు.చ. తప్పకుండా పాటించే ప్రజా నాయకుడు నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు ఆర్థర్ .సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులు పనిచేసే పొలానికే వెళ్లి అందజేశారు. నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళుతున్న ఎమ్మెల్యే మార్గ మధ్యలో లబ్ధిదారులు షేక్ సభిరాభి కి రూ,2.20 లక్షలు, శాంసన్ కు ఒక లక్ష ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ప్రజలు ఉన్నచోటనే పరిపాలన అందించడం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లక్ష్యమని దానికి నిదర్శనం సచివాల వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వడం సంక్షేమ పథకాలు అందించడం జరగలేదని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి సహాయనిది లబ్ధిదారులకు వారు ఎక్కడ ఉన్నా వారికి చెక్కులు అందజేయడం తమ కర్తవ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారిని శ్రావణి , పశుసంవర్ధక శాఖ అధికారిని నిర్మల దేవి , తాటిపాడు గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి , వైసీపీ నాయకులు ఉస్మాన్ భాష తదితరులు పాల్గొన్నారు.