ఆదర్శ పాఠశాలలో ఘనంగా ఏక్తా దీవాస్
1 min readపల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: రుద్రవరం ఆదర్శ పాఠశాల నందు ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు అధ్యక్షతన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఉపాధ్యాయుల విద్యార్థులు పూలమాల వేసి నివాళులర్పించినారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జాతీయ ఐక్యతా దినోత్సవం పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కి జాతి ఘనంగా నివాళులర్పిస్తోందని అన్నారు. ఉపాధ్యాయ బృందం వైస్ ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ అందరూ కలిసి వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాల వేసి పుష్పాంజలి ఘటించారు. పాఠశాలలో నిర్వహించిన ఐక్యతా దినోత్సవంలో భాగంగా సీనియర్ ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి, సమాచార ప్రసార శాఖ మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు అని అన్నారు.దేశ సమగ్రత పరిరక్షణకు కృషి చేస్తామని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రామం నందు ఉపాధ్యాయ బృందం నాన్ టీచింగ్ సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.