కోవెలకుంట్లలో దద్దరిల్లిన సీమ సింహ గర్జన
1 min read– రాయలసీమ విద్యార్థి, యువజన సంఘల జేఏసీ
పల్లెవెలుగు, వబ్, కోవెలకుంట్ల : కర్నూలులో న్యాయ రాజధాని5 ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అభివృద్ధి వికేంద్రీకరణ కు మద్దతుగా కోవెలకుంట్ల విద్యార్థులతో కలిసి గాంధీ సెంటర్ నుంచి గ్రామపంచాయతీ సర్కిల్ వరుకు సీమ సింహ గర్జన ర్యాలీ నిర్వహించి భారీ ఎత్తున ధర్నా నిర్వహించిన రాయసీమ విద్యార్థి యువజన సంఘాల జె.ఏ.సి గౌరవ అధ్యక్షుడు వంకిరి.రామచంద్రుడు, చైర్మన్ షేక్. రియాజ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ నుంచి అనేక మంది మంత్రులుగా,ముఖ్య మంత్రులుగా,ప్రధాన మంత్రులు,గా పని చేసిన రాయలసీమ కి పూర్తిస్థాయిలో అన్యాయం చేసారని,గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో రాయలసీమకు అన్యాయం చేసి ఏకపక్ష నిర్ణయంతో రాజధాని ని అమరావతి కి తరలించి రాయలసీమ కు పూర్తిస్థాయిలో అన్యాయం చేసారని వారు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వాసుల కల హైకోర్టు,జ్యూడిషల్ క్యాపిటల్ ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తుంటే రాయలసీమలో ఉండే కొంతమంది సీమద్రోహులు కోస్తా జపం చేస్తూ అడ్డుపడుతున్నారని, వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో హైకోర్టును జ్యూడిషల్ క్యాపిటల్ ఏర్పాటు చేసి రాయలసీమ వాసుల కళ నెరవేర్చాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ రామకృష్ణ, మభూ విద్యార్థి, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.