టీడీపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి
1 min read– వై నాగేశ్వరరావు యాదవ్ . టీడీపీ రాష్ట్ర యాదవ సాధికారిక కన్వీనర్
పల్లెవెలుగు, వెబ్ అనంతపురం: అనంతపురం పార్లమెంట్ , హిందూపురం పార్లమెంట్ , ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ యాదవ సాధికారిక రాష్ట్ర కన్వీనర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ గారు, రెండు పార్లమెంట్ ల యాదవ సాధికారిక కమిటీ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతం చెయ్యడం గురించి చర్చించడం జరిగింది. టీడీపీ యాదవ సాధికారిక రాష్ట్ర కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్ గారు మాట్లాడుతూ సత్యసాయి జిల్లా , అనంతపురం జిల్లాలో ఉంటున్న ప్రతి ఒక్క యాదవడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించలి, యాదవ సాధికారిక కమిటీలని పటిష్టం చేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతిఒక్కరు కష్టపడి యాదవులు పని చెయ్యాలని పిలుపునిచ్చారు. యాదవుల సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు , తెలుగుదేశం పార్టీ కోసం కష్ట పడి పనిచేసే ప్రతి ఒక్క యాదవుడికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సముచితమైన గుర్తింపు పార్టీ ఇస్తుందన్నారు. ఈకార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ యాదవ సాధికారిక అధ్యక్షుడు అదిశేషులు, హిందూపురం పార్లమెంట్ TNTUC బాల ఆంజనేయులు యాదవ్, ఉరవకొండ యాదవ సాధికారిక సభ్యులు రవి కుమార్ , నంద్యాల పార్లమెంట్ బి.సి.సెల్ నాయకులు రామ్ మోహన్, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు నాగేంద్ర , TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిపోగు బజారన్న , దినేష్ మరియు యాదవ సాధికారిక నాయకులు పాల్గొన్నారు.