హెడ్ కానిస్టేబుల్ తలగడ దీవి కాదు తలమానికం
1 min read– కోవిడ్ సమయంలోను అందరు వెనుకడుగేసె సమయంలో ధైర్య సాహసాలతో విధి నిర్వాహణ
పల్లెవెలుగు, వెబ్ విజయవాడ: విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో జరిగిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు శాఖలకు సంబంధించి అత్యుత్తమ సేవలు అందించిన వారికి అవార్డ్స్ ప్రధానం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ తలగడదీవి శ్రీనివాస్ ని ఎంపిక చేసి వీరికి వైయస్ రాజశేఖర్ రెడ్డి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రధానం చేశారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ 25 ఏళ్లుగా పోలీస్ శాఖలు సేవలందిస్తున్నారని అనేక పర్యాయాలు అత్యంత సాహసోపేత నిర్ణయాలతో సేవలందించే వారిని ఇటీవల కరోనా మహమ్మారి సమయంలో కూడా పోలీస్ శాఖకు అనేక సేవలు అందించారని వీరు కూడా కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో జయించి పలువురి ప్రశంసలు డిపార్ట్మెంట్ నుంచి అందుకున్నారని సర్వీస్ లో డ్యూటీ కి టైం టు టైం అత్యంత బాధ్యతాయుతంగా సేవలు అందించటం, ఇటీవల పెనమలూరు మండలం పోరంకి శాలిపేటలో నివసించే షేక్ హరుకున్నీసా సచివాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నరు,భర్త ఇస్మాయిల్ అదనపు కట్నం కోసం వేధిస్తూ 2021 జూలై 18న టి కాసే గిన్నెతో ఆమె భర్త దాడి చేసి గాయపరిచడం . ఆమె దిశ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయగా పెనమలూరు పోలీస్ స్టేషన్ నుంచి 7 నిమిషాల్లో బాధిరాలు వద్దకు చేరుకొని వెంటనే ఆమెను రక్షించి, అంబులెన్స్ ద్వారా హాస్పటల్ పంపి నిందితుడను కస్టడీలోకి తీసుకున్నారని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గురించి వివరించారు.కోవిడ్ సమయంలోను పలువురు కోవిడ్ సోకిన ఖైదీలను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించే క్రమంలో ఆయన కోవిడ్ భారిన పడటం గమనార్హం. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన అవార్డు గ్రహీతలు అందర్నీ అత్యుత్తమ నోవోటెల్ హోటల్లో ఒకరోజు ముందుగానే అత్యంత గౌరవంగా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది.