PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు

1 min read

పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలను అర్పించిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని తహాశీల్దార్ వెంకటశివ కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక తహాశీల్దార్ కార్యాలయంలో తహాశీల్దార్ వెంకటశివ రెవిన్యూ సిబ్బంది అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహాశీల్దార్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసులో జన్మించాడన్నారు. ఉన్నత విద్యా చదివిన చదివిన ఆయన ప్రాత, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతులు అయ్యాడని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవిగా నిలిచాడన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ బోధించిన సత్యం అహింస హరిజనవదరణ అనే ఆశయాల కొరకు జీవితమంతా అప్రూవ్ చేసిన గొప్ప మహానీయుడని గుర్తు చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధనలో భాగంగా 1952 డిసెంబర్ 15న ఆయన అమరుడయ్యాడని అంతటి మహనీయుని త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటయ్య ఆర్ ఐ నాగేంద్రుడు వీఆర్వోలు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

About Author