రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లి,మిడుతూరు,పీరుసాహెబ్ పేట,కడుమూరు గ్రామాలలో జిల్లా ఏరువాక కేంద్రం కర్నూల్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణారావు,డాక్టర్ జి.ప్రసాద్ బాబు విస్తరణ శాస్రతవేత్త,మొక్కజొన్న శాస్త్రవేత్త పి.భరత్ చంద్ర తెగుల శాస్త్రవేత్త సంయుక్తంగా కలిసి పంటలను పరిశీలించారు.మొక్కజొన్న పంటలు పాము పాడు తెగులు,కాండం కుల్లు తెగులు గుర్తించారు.వీటి నివారణకు కాండం కుళ్ళు,తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాలలో పంట వేసేముందు పచ్చిరొట్టె పైనను సాగుచేసి నెలలో కలియ దున్నాలి. ట్రైకోడెర్మా సిలింద్రాన్ని పశువుల ఎరువులో వృద్ధిచేసి మూడు,నాలుగు సంవత్సరాలు వరుసగా నెలలు కలుపుతూ పోవాలి.పాము పొడ తెగులు,ప్రిపికోనజాల్ మందు 2ఎం ఎల్ పిచికారి చెయ్యాలి. ఈకార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ సహాయకులు అశోక్ మరియు రైతులు పాల్గొన్నారు.