వీహెచ్పి ఆధ్వర్యంలో భక్తిప్రపత్తులతో శ్రీ గోపాష్టమి
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: విశ్వహిందూపరిషత్ సంస్థాగత కార్యక్రమాల్లో ఒకటైన శ్రీ గోపాష్టమి (గోపూజా కార్యక్రమం) కర్నూలు నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేష్ థియేటర్ ప్రక్కన గారు గాయత్రి గోశాల నందు వైభవంగా నిర్వహించబడింది ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వహిందూ పరిషత్ జిల్లా మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి రాధిక జంపాల మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ నిర్వహించే ఏడు కార్యక్రమాల్లో కార్తీక శుక్ల అష్టమి రోజున వచ్చే శ్రీ గోపాష్టమి నుంచి ఈ రోజున ఈ గోశాలలో నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకమని సర్వదేవతా నిలయమైన ఈ గోవును పవిత్ర కార్తీకమాసంలో పూజించుకోవడం చాలా పుణ్యకార్యమనీ శ్రీ కృష్ణుడు ఎంతో ఇష్టంగా భావించే గోవును పూజిస్తే ఆ శ్రీకృష్ణుని పూజించినట్లే అని తెలియజేశారు మరోచోట హరిశ్చంద్ర శరీన్ నగర్ లోని సద్గురు త్యాగరాజ సీతా రామాలయం లో నగర మాతృ శక్తి కన్వీనర్ శ్రీమతి మాళిగి భార్గవి ఆధ్వర్యంలో గోపాష్టమి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సేవా కన్వీనర్ తుంగా రమేష్,నగర ఉపాధ్యక్షులు కృష్ణపరమాత్మ,నగర ఉపాధ్యక్షులు శివపురం నాగరాజు నగర కార్యదర్శి ఈపూరు నాగరాజు నగర సహసేవా కన్వీనర్ మేడం శేఖర్ గుప్త,ప్రఖంఢ ఉపాధ్యక్షులు శ్రీమతి అరుణ కుమారి కార్యదర్శి గూడూరు గిరిబాబు,సహకార్యదర్శి సునీల్,ప్రఖంఢ మాతృ శక్తి కన్వీనర్ గూడూరు రాధాదేవి తదితరులు పాల్గొన్నారు.