అక్రమ బదలీ ఉత్తర్వులు అపండి – ఆప్టా
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: రాష్ట్రం లో ఉపాధ్యాయ సాధారణ బదలీ ల కొరకు ఉత్తర్వు లను ఆలస్యం చేస్తూ సిఫార్స్ బదలీ లకు సంబంధించిన ఫైల్ లు వేగవంతం చేశారు అనే విషయం ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయం లో ఏ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా)రాష్ర్ట నాయకులు ఏ జి ఎస్ గణపతి రావు మరియు కాకి ప్రకాష్ రావు లు రాష్ర్ట ముఖ్య మంత్రి గారికి మరియు విద్యా శాఖ మంత్రి గారికి వేరు వేరుగా ప్రాతినిథ్యం చేయడం జరిగినది. రాష్ట్రం లో ప్రస్తుత ఉపాధ్యాయ బదలీ నియమాలయందు ఉపాధ్యాయుల అవసరాల మేరకు ప్రాధాన్యత కల్పించే విధంగా నియమాల తో పారదర్శక విధానం లో జరుగుతున్నాయి.ఈ విధానంలో అందరికీ సమ న్యాయం జరిగే విధంగా నియమాలు ఉన్నాయి. అటువంటప్పుడు కుంటి సాకులతో సిఫార్స్ లేఖ లతో దానికి తూట్లు పొడిచే విధంగా ఉన్నత స్థాయి లో పలుకుబడి వున్న వారి కోసం అడ్డ దారిలో ఉత్తర్వులు ఇవ్వటం అనేది దారుణం.కాబట్టి ఈ సిఫార్స్ బదలీ లు వెంటనే ఆపేయాలి. ఇప్పటికే ఉద్యోగ ఉపాద్యాయ వర్గాలలో అర్ధిక అంశాల్లో బిల్లులు రాక అసంతృప్తి తో వున్నారు. ఈ సమయంలో మరల అక్రమ బదలీ లు చేయడం అనేది ఉపాధ్యాయ లోకం లో చాల మందికి ఆందోళన కలగ చేస్తుంది. వెంటనే అక్రమ బదలీ లు నిలుపుదల చేసి కౌన్సిలింగ్ విధానం లో సాధారణ బదలీ లకు ఉత్తర్వులు విడుదల ముఖ్యమంత్రి గారిని మరియు విద్యా శాఖ మంత్రి గారిని కోరుతున్నారు. ఏ జి ఎస్ గణపతి రావు, ఆ ప్టా రాష్ర్ట అధ్యక్షులు కాకి ప్రకాష్ రావు ఆప్తా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి.
బదలీ, సిఫార్స్, ఏపి ప్రైమరీ టీచర్స్, న్యాయం