మద్యం కేసులలో పట్టుబడిన వాహనాల వేలం
1 min read– 8వ తేదీన ఆత్మకూరు సబ్ డివిజన్ లో..
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: ఆత్మకూరు సబ్ డివిజన్ లో మద్యం (ఎక్సైజ్ )కేసులలో పట్టుబడిన వాహనాలకు ఈ నెల 8వ తేదీన వేలం పాటను ఆత్మకూరు డిఎస్పీ శృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని నందికొట్కూరు రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఒక ప్రకటన లో ఆయన తెలియజేశారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో పలు మద్యం(ఎక్సైజ్ ,సారాయి)కేసులలో పట్టుబడిన వాహనాలు ఆత్మకూరు టౌన్ డిఎస్పి ఆధ్వర్యంలో బైకులు ,ఆటోలు ,కార్లు మొదలైన వాటిని ఆత్మకూరు పట్టణం లో పోలీసు స్టేషన్ నందు నవంబరు 08 వ తేదీన , బ్రహ్మణకొట్కూరు పోలీసు స్టేషన్ నందు నవంబరు 09 పోలీసు వారి ఆధ్వర్యంలో వేలంపాట వేయనున్నారన్నారు. ఈ వేలంపాటయందు పాల్గొని వేలంపాటలో గెలుపొంది వాహనం దక్కించుకున్న వ్యక్తి వారు పాడిన వేలం పాట యొక్క డబ్బులతో జీఎస్టీ కూడా చెల్లించవలసి ఉంటుందన్నారు. బైకులు 131,ఆటోలు 10, కార్లు 05 మొత్తం 146 వాహనాలు వేలం వేయనున్నారని తెలిపారు.