PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..

1 min read

– కరాకు రెండు లక్షల నష్టపరిహారం ఇవ్వాలి..శ్రీనివాస ట్రేడర్స్ దుకాణం సీజ్ చేయాలి..
పల్లెవెలుగు, వెబ్​ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు, జూపాడుబంగ్లా, పగిడ్యాల, మండలాల పరిధిలో అనేక మంది పత్తి రైతులు నకిలీ విత్తనాల బారిన పడి తీవ్రంగా నష్టపోయారని చేరుకుచర్ల గ్రామానికి చెందిన విజయ్ 20 ఎకరాలలో పత్తి (నూజివీడు గోల్డ్) వేసి దాదాపు రూ, 20 లక్షల నష్టపోయాడని తక్షణమే ఆ రైతు ను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా నాయకులు రఘురాంమూర్తి, రమేష్ బాబులు డిమాండ్ చేశారు. బుధవారం చేరుకుచర్ల, వీపనగండ్ల గ్రామంలోని విజయ్ పొలాలను సిపిఐ ఆధ్వర్యంలో పరిశీలించారు. అనంతరం అందుబాటులో లేని మిడ్తూరు వ్యవసాయ అధికారి కార్యాలయంలో వినతిపత్రంను తలుపుకి అంటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గం లో ఈ ఏడాది అధిక సంఖ్యలో పత్తి రైతులు పత్తి పంటను సాగు చేశారని, అధిక ధరలు ఉన్న కూడా లెక్కచేయకుండా విత్తనాన్ని కొనుగోలు చేసి సాగు చేశారని తీరా 90 రోజులు గడిచిన చెట్టుకు కాయలు లేని పరిస్థితి అన్నారు. నందికొట్కూరు పట్టణంలో ఉన్న శ్రీనివాస ట్రేడర్స్ డీలర్లు రైతులను మోసం చేసి నకిలి పత్తి విత్తనాలు అమ్మరని విత్తనాలు అమ్మిన ఆ షాపును సీజ్ చేయాలని వారి డిమాండ్ చేశారు. నూజివీడు గోల్డ్ రకం కంపెనీ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. లక్షల్లో జీతం తీసుకుంటున్న వ్యవసాయ అధికారులు పంటలకు ఏమి జరుగుతుందో ఏ విత్తనాలు ఎవరు అమ్ముతున్నారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉద్యోగం చేస్తున్నారన్నారు. మామూళ్ల మత్తులో ఉన్న అధికారులు కనీసం కొన్ని షాపులకు విజిలెన్స్ తనిఖీలు కూడా నిర్వహించడం లేదన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టి కేంద్రీకరించి నందికొట్కూరు పట్టణంలో ఉన్న షాపులపై ప్రత్యేక విజిలెన్స్ అధికారులచే దాడులు నిర్వహించాలని వారి డిమాండ్ చేశారు. రైతులకు కంపెనీ వారు నష్టపరిహారం చెల్లించకపోతే షాప్ యజమానులే చెల్లించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటానికి సిపిఐ సిద్దపడుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు విజయ్, నాయకులు స్వాములు రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author