అన్నక్యాంటిన్ల ప్రాధాన్యత ఈ ప్రభుత్వం గుర్తించాలి : టి.జి భరత్
1 min read– అన్న క్యాంటిన్లు ప్రారంభించాలని ప్రభుత్వానికి సలహాదారులైనా సూచించాలి
పల్లెవెలుగు , వెబ్ కర్నూలు: రాష్ట్రంలో అన్న క్యాంటిన్లను మళ్లీ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటుచేసుకున్న సలహాదారులైనా ప్రభుత్వానికి సూచించాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ కోరారు. నగరంలోని 52 వ వార్డులో ఆ పార్టీ ఆద్వర్యంలో ఒక్క రోజు అన్న క్యాంటిన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టితో కలిసి పాల్గొన్న టిజి భరత్ రిబ్బన్ కట్ చేసి అన్న క్యాంటిన్ ప్రారంభించారు. అనంతరం పేదలకు ఉచితంగా అన్నం వడ్డించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ తాము ఒక్కరోజు ఏర్పాటుచేస్తున్న అన్న క్యాంటిన్లను చూసి పేద ప్రజల మొహంలో సంతోషం కనబడుతోందన్నారు. పేదల పథకమైన అన్న క్యాంటిన్లను ఈ ప్రభుత్వం కొనసాగించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వంలో ఉన్న సలహాదారులైనా అన్నక్యాంటిన్ల ప్రాధాన్యత గురించి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. అన్న క్యాంటిన్ పథకాన్ని కనీసం పేరుమార్చయినా కొనసాగించాలని భరత్ కోరారు. అన్న క్యాంటిన్ పథకంలో లోపాలుంటే సరిదిద్ది మళ్లీ ప్రారంభించాలని కోరుతున్నట్లు భరత్ చెప్పారు. అనంతరం సోమిశెట్టి మాట్లాడుతూ కర్నూల్లో భరత్ ఏర్పాటుచేస్తున్న అన్న క్యాంటిిన్లకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కర్నూల్లో భరత్ ఎమ్మెల్యే అయితే ప్రజల ఇబ్బందులు తీరతాయన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి బొల్లెద్దుల రామక్రిష్ణ, నగర అధ్యక్షుడు గున్నామార్క్, నేతలు నాగన్న, కేబీ శ్రీనివాసులు, హనుమంత్ రెడ్డి, వెంకటేష్, ప్రసాద్, ఆర్య శంకర్, ప్రసాద్, బుచ్చిబాబు, వి. శ్రీనివాసులు, మలిగెపోగు ప్రసాద్, అంజి, వివిధ వార్డుల ఇంచార్జీలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.