వర్షాకాలంలో రైతులు విద్యుత్ పై అప్రమత్తంగా ఉండాలి
1 min read– ట్రాన్స్ కో, ఏఈ బి రామలింగారెడ్డి
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: చెన్నూరు మండలంలోనీ ప్రజలురైతులు, వర్షాకాలంలో విద్యుత్ పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనిపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ట్రాన్స్కో ఏఈ బి రామలింగారెడ్డి, సూచించారు. బుధవారం ఆయన స్థానిక సబ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలు వర్షాకాలంలో విద్యుత్ కు సంబంధించి తాగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలియజేశారు, ముఖ్యంగా తడిసిన స్తంభాలను ముట్టుకోరాదని తెలియజేశారు, అలాగే ఇండ్లల్లో ఉన్న స్విచ్ బోర్డులు విషయంలో జాగ్రత్తలు వహించాలని తెలిపారు, అంతేకాకుండా స్విచ్ బోర్డులలో హీటర్లు, ప్లగ్ లు ఎలా పడితే అలా వేయరాదని సూచించారు, దీని ద్వారా ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నారు, కాబట్టి ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు, అదేవిధంగా స్విచ్ బోర్డులు వేసే సమయంలో పొడిగా ఉన్న కర్రతో కానీ, లేదా ప్లాస్టిక్ వస్తువులతో కానీ వాటిని ఆన్ చేసుకోవలసి ఉంటుందని ఆయన తెలిపారు, కరెంటు కు సంబంధించిన ఏ వస్తువులను కూడా ఈ వర్షాకాలంలో చేతులతో ముట్టుకో రాదని ఆయన తెలిపారు, అలాగే ఈ విషయంలో చిన్నపిల్లల పై మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, కాబట్టి ప్రజలు విద్యుత్ పై వర్షాకాలంలో తగిన పాటించాలని ఆయన తెలియజేశారు.