ఆర్.కృష్ణయ్య పై ఆసత్య ప్రచారాలు మానుకోవాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ విజయవాడ: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పై,సీఎం జగన్ పై తమ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారని జరుగుతున్న ప్రచారాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గ నరేష్ తీవ్రంగా ఖండించారు.ఆర్.కృష్ణయ్య ని రాజ్యసభ సభ్యుడిగా ప్రకటించగానే సంఘం తరపున జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసింది తామే అని ఆయన గుర్తు చేశారు.. కొత్తగా పుట్టుకొచ్చిన కొన్ని బీసీ సంఘాలు తమ మనుగడ కోసమే ఆర్.కృష్ణయ్య పై ఆసత్య ప్రచారాలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ లు అందరూ గమనించాలని ఆయన సూచించారు…గాంధీనగర్ లోని వెన్నెల హోటల్లో బీసీ సంక్షేమ సంఘం నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గ నరేష్ మాట్లాడుతూ మూడు రోజుల క్రితం విజయవాడలో జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య పై సంఘం నేతలు తిరుగుబాటు ప్రారంభించారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కృష్ణయ్య స్థాపించిన సంఘంలోనే అందరం పని చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. బీసీ ల గురించి నాలుగు దశాబ్దాలుగా నిజమైన పోరాటం చేసిన నాయకుడు కృష్ణయ్య అని ఆయన గుర్తు చేశారు. కృష్ణయ్య చేసిన సేవలను గుర్తించి రాజ్యసభ సభ్యుడు ని చేస్తే దానిని కొంతమంది సహించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు..వైస్సార్ కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టం అని జగన్ చేస్తున్న పాలన,, మంచి కార్యక్రమాలు కి ఆయనను బాగా ఆదరిస్తామని చెప్పారు.. వైస్సార్ కుటుంబానికి అండగా నిలబడుతూ కార్యక్రమాలు చేస్తున్నామని గతంలో తనపై అనేక కేసులు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కి కొమ్ము కాసే క్యారెక్టర్ తమది కాదన్నారు..ఆర్.కృష్ణయ్య సేవలు గుర్తించి ఆయనకు పదవి ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అన్నారు.. మొన్న జరిగిన సమావేశంలో కొంతమంది బీసీ నేతలు తమ వ్యక్తిగత నిర్ణయాన్ని తెలియచేసారని దానికి సంఘానికి సంబంధం లేదన్నారు..త్వరలోనే ఆర్.కృష్ణయ్య తో విజయవాడలో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు అయన చెప్పారు. ఏనాడు బీసీ సంక్షేమ సంఘం చేసిన ఉద్యమాల్లో లేని వారు ఆర్.కృష్ణయ్యకు పదవి రాగానే ఆయన కాళ్ళు దగ్గరకు చేరే పరిస్థితి వచ్చిందన్నారు..ఎవరైనా మరొక్కసారి జగన్ పై కానీ ఆర్.కృష్ణయ్య పై కానీ నోరుజారి మాట్లాడితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అర్బన్ యువజన నాయకులు కటారి విజయ్,,ఎస్ సి సెల్ ఇన్ఛార్ గడ్డం సురేష్ బాబు,,అర్బన్ యువజన విభాగం ఇన్ఛార్ కిషోర్ బాబు పాల్గొన్నారు.