అంగన్వాడి కేంద్రాల్లో రంగు మారిన గుడ్లు
1 min read ఏజెన్సీల సమన్వయ లోపమే కారణం
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు : మండలంలో ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడి కేంద్రాలకు ఏజెన్సీల ద్వారా అందించే గుడ్లు రంగు మారడం కుళ్ళిపోవడం తో పాఠశాలల్లో విద్యార్థులకు అంగన్వాడి కేంద్రాల చిన్నారులకు ఇవ్వకుండా ఉపాధ్యాయులు అంగన్వాడి కార్యకర్తలు నిలుపుదల చేశారు. గత మంగళవారం చెన్నూరు మండలంలోని అన్ని పాఠశాలలకు అంగన్వాడి కేంద్రాలకు ఏజెన్సీ ద్వారా గుడ్లు సరఫరా చేశారు. కోడిగుడ్లను వంట ఏజెన్సీ వారు ఉడకపెట్టగా గుడ్డు పైపర విప్పి చూడగా నల్లగా రంగు మారినట్లు కనిపించాయి. మరికొన్ని గుడ్లు సగానికి ఉడికి చెడిపోయి ఉన్నాయి. పిల్లలకు ఇవ్వకుండా వంట ఏజెన్సీ వారు నిలుపుదల చేశారు. చెన్నూరు మండలంలో చెన్నూరు ఉప్పరపల్లి రాచనాయపల్లి గుర్రంపాడు ప్రాంతాల్లోని పాఠశాలల్లో అంగన్వాడి కేంద్రాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయులు అంగన్వాడి కార్యకర్తలు వంట ఏజెన్సీ వారు గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీ వారికి అలాగే ఐసిడిఎస్ అధికారులకు మండల విద్యాశాఖ అధికారులకు తెలియజేసినప్పటికీ వారు ఏ మాత్రం పట్టించుకోలేదు గుడ్లు సరఫరాలో నాణ్యత లోపించడం చెడిపోవడం విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి వెళ్లడంతో వారు ఆయా పాఠశాలలోని ఉపాధ్యాయులు అంగన్వాడి కార్యకర్తలును నిలదీస్తున్నారు. రెండు రోజులుగా పాఠశాలల్లో విద్యార్థులు చిన్నారులకు అనారోగ్యం పాలవుతారన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందిస్తామని ఒక పక్క ప్రకటిస్తుంటే పౌష్టికాహారంలో ఒకటైన గుడ్లల్లో నల్లగా మారడం చెడిపోవడం జరుగుతున్నది. ఇంత జరుగుతున్నా ఐసిడిఎస్ అధికారులు కానీ మండల విద్యాశాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు.