అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్టు అమానుషం..
1 min readపల్లెవెలుగు, వెబ్ నంద్యాల: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుని సిఐడి పోలీసులు అరెస్ట్ చట్ట విరుద్ధమని… తెలుగు యువత జిల్లా కార్యదర్శి క్రాంతి కుమార్ తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన స్థలం ప్రహరీ గోడకు సిఐడి కి సంబంధం ఏంటి.. ఇది ముమ్మాటికి జగన్ రెడ్డి కక్ష సాధింపు.రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం సిఐడి ని అడ్డం పెట్టుకొని టిడిపి నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సిఎం జగన్ నియంతలా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఐటీడీపీ, టిడిపి నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి సిఐడి అధికారులు వేదించి, జగన్ కు వత్తాసు పలుకుతూన్నారని. జగన్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తుల వ్యవహరిస్తు అక్రమ కేసులు పెడుతున్న సిఐడి పోలీసుల విధానాలను ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకించి ఖండించాలి.. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలపై జగన్ రెడ్డి సాధిస్తున్న కక్ష సాధింపుకు త్వరలో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని క్రాంతి కుమార్ హెచ్చరించారు.