అయ్యన్న పాత్రుడు అరెస్ట్ పై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం
1 min readపల్లెవెలుగు, వెబ్ ఆత్మకూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సీఎంలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మండిపడ్డారు. గోడలు దూకి, తలుపులు పగల గొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బీసీ నేత అయ్యన్న పాత్రుడిని, ఆయన కుమారుడు రాజేష్ ని అరెస్టు చెయ్యడం తనకు దిగ్ర్బాంతి కలిగించిదని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోందని, ఇప్పటికే 10కి పైగా కేసులు పెట్టారని అన్నారు. నాడు ఇంటి నిర్మాణాలు కూల్చి వేత మొదలు.. అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సీఐడీ విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని అన్నారు. దొంగల్లా పోలీసులు ఇళ్ల మీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. వైసీపీ సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీపై బీసీ నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్నను అరెస్టు చేశారని బుడ్డా రాజశేఖర రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేసులు, అరెస్టులు సాగిస్తున్నారని బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడు, రాజేష్ లను విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు.