‘రుయా’ మరణాలు..ప్రభుత్వ హత్యలే..!
1 min readపల్లెవెలుగు వెబ్: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన 11 మంది మరణాలు.. ప్రభుత్వ హత్యలే అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ ఆరోపించారు. ఆక్సిజన్ అందక 11 మంది ప్రాణాలు కోల్పోవడం జగన్ ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు. ఈ ఘటన దిగ్ర్భాంతికి గురిచేసిందని అన్నారు. పాలన చేతగాకపోతే.. జగన్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు.
జగన్ పై కేసు నమోదు చేయాలి: అచ్చెన్నాయుడు
పాలన చేతకాకపోతే జగన్ పదవి నుంచి తొలగిపోవాలని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయిడు. తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన దారుణానికి జగన్ మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల బంధువులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.