PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశ్వహిందూపరిషత్ హితచింతక ఉద్యమం

1 min read

– 15 రోజుల్లో 25 వేల మంది హిందువులను విశ్వహిందూ పరిషత్ లో చేర్చుకుంటాం.
– విశ్వహిందూపరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ.
పల్లెవెలుగు,వెబ్ కర్నూలు: నవంబర్ 6 ఆదివారం నుండి ప్రారంభమై నవంబరు 20 ఆదివారం వరకు 15 రోజుల్లో, విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా 200 గ్రామాలల్లో ,110 వార్డులల్లో హిందువులను కలిసి హితచింతక ఉద్యమం ద్వారా 25 వేల మందికి పైగా హిందువులను విశ్వహిందూ పరిషత్ లో చేర్చుకుంటాం. 2024 నాటికి విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 ఏళ్లు పూర్తవుతాయని, ఇందుకోసం షష్టిపూర్తి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ రోజు జరిగిన విశ్వహిందూ పరిషత్ కార్యాలయం లో జరిగిన కార్యకర్తలు సమావేశంలో విశ్వహిందూపరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ తెలిపారు.ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తం చేసేందుకు నవంబర్ 6 నుంచి నవంబర్ 20 వరకు సమాజంలోని ప్రతి కులం, మతం, వర్గాలను కలుస్తాం, వారిని హిందూ సమాజం మరియు జాతీయ ప్రయోజనాలతో అనుసంధానిస్తాం. ప్రచారంలో ప్రముఖ రంగాలకు చెందిన వ్యక్తులను కలవడానికి ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయబడతాయి. సమాజంలో అన్ని రంగాల ప్రముఖులు అంటే డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, లాయర్లు, మాజీ జడ్జీలు, గాయకులు, నటులు, క్రీడాకారులు తదితరులను కూడా కలుస్తాం. 25 వేల మంది ప్రజలకు చేరువయ్యేలా జిల్లా 200 గ్రామాలు,110 వార్డు లను చేరుకోవడమే హిత చింతక్ అభియాన్ బృందాల లక్ష్యమని,సుమారు 2000 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమం కోసం అహర్నిశలు పనిచేస్తారనీ విశ్వహిందూపరిషత్ ఉపాధ్యక్షులు డా.లక్కిరెడ్డి అమరసింహారెడ్డి అన్నారు.అశేష హిందూ సమాజానికి విశ్వహిందూపరిషత్ యొక్క పనులను లక్ష్యాలను గురించి సవివరమైన సమాచారం కూడా ఇవ్వబడుతుంది. ప్రజా సేవ కోసం విశ్వహిందూపరిషత్ యొక్క వివిధ రంగాలలో పనిని విస్తరించడం హిత చింతక్ అభియాన్ యొక్క లక్ష్యం. మరింత అణగారిన సమాజాన్ని సేవా కార్యక్రమాలతో అనుసంధానం చేయడం, సనాతన ఆచారాలను కొత్త తరానికి అందించడం, గోవుల రక్షణ, సామాజిక సామరస్యం, మహిళా సాధికారత, కుటుంబ ప్రభోదనo, పర్యావరణ పరిరక్షణ, మఠాలు, దేవాలయాల సక్రమమైన నిర్వహణతో పాటు హిందూ సమాజాన్ని సువ్యవస్థీకృతం చేయడం మరియు రక్షించడం అనే సంకల్ప స్ఫూర్తిని పెంపొందించడం కూడా ప్రచారం యొక్క లక్ష్యం.మతమార్పిడులు, లవ్ జిహాద్‌లను అరికట్టేందుకు విశ్వ హిందూ పరిషత్ ఎలా కట్టుబడి ఉందో, తిరిగి స్వధర్మానికి తిరిగి తీసుకువచ్చే సమాచారం కూడా ఈ ప్రచారంలో ఇవ్వబడుతుందని కర్నూలు నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి తెలియజేశారు. ఈ సమావేశంలో,రాష్ట్ర నాయకులు సందడి మహేష్, గూడాసుబ్రహ్మణ్యం, హితచింతక్ అభియాన్ జిల్లా ప్రముఖ్ ఏ.శ్రీనివాసరెడ్డి,విభాగ్ బజరంగ్ దళ్ కన్వీనర్ నీలి నరసింహ,నగర ఉపాధ్యక్షులు శివపురం నాగరాజు,కార్యదర్శి ఈపూరి నాగరాజు,నగర బజరంగ్ దళ్ కన్వీనర్ భగీరథ, రామాలయ ప్రఖంఢ కార్యదర్శి గిరిబాబు,బజరంగ్ దళ్ కన్వీనర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

About Author