మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా జగనన్నే
1 min read– 2024లో ఇదే ప్రజా తీర్పు మాజీ ఉపముఖ్యమంత్రి,ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని.
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు: స్థానిక వంకాయ గూడెం 16వ డివిజన్లో అడుగు అడుగునా మహిళల పూల జల్లులు,చిన్నారుల ఆత్మీయ స్వాగతాలతో జన హృదయనేత ఆళ్ల నానికి గడప గడపలో ఘన స్వాగతoపలికారు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తూ గడప గడపకు పాదయాత్రగా పర్యటించిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే ఆళ్ల నాని.పేదవాడి జీవితాలకు అండగా నిలిచిన జగనన్న సంక్షేమ పాలనపై గడప గడపలో హర్షం వ్యక్తం చేసిన లబ్దిదారులు.సంక్షేమ పాలనతో రాష్ట్రములోని అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటున్న జగనన్నే రాబోయే 2024 ఎన్నికల్లో కూడా 175 కి 175 స్థానాలు గెలిచి మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు.గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 43వరోజు ఏలూరు కార్పొరేషన్ 16వ డివిజన్ 41, 42వ సచివాలయాల పరిధిలోని చేపల చెట్టు సెంటర్, రామాలయం వీధి, వంగాయ గూడెం సెంటర్ సహా పలు ప్రాంతాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ జిజ్జువరపు విజయ నిర్మల రమేష్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు,కార్యకర్తలు, డివిజన్ ప్రజలు, మహిళలు ఆళ్ల నాని కి భారీ గజమాలలతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. భారతదేశ మహానీయుల వేషధారణలో చిన్నారులు ఆళ్ల నానికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆళ్ల నాని ఆత్మీయంగా పలకరీంచారు.అనంతరం గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పలు సంక్షేమ పథకాల అమలు తీరును లబ్దిదారులతో మాట్లాడుతూ స్వయంగా పరిశీలించారు. ప్రతి నెలా 1వ తేదీనే ఫించన్ అందుతున్న తీరుతో పాటు అమ్మఒడి, చేయూత, ఆసరా వంటి అనేక సంక్షేమ పధకాలు ఎంతో పారదర్శకంగా తమకు అందుతున్న తీరు పై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు,ఈ సందర్భంగా మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన అమలు చేస్తున్నారని ఆళ్ల నాని తెలిపారుసంక్షేమ పాలనకు మద్దతిస్తూ ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున రాజకీయ చైతన్యం రావటం ఎంతో గర్వకారణం అని ఆళ్ల నాని తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు,రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీ లక్ష్మీ, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ యెడ్ల తాతాజీ,నగర డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్ బాబు, శ్రీనివాస్,మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, నగర మహిళా అధ్యక్షురాలు నున్న స్వాతి కిషోర్, వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు MRD బలరాం,కో-అప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాధ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ఖాజా ముగ్ధుమ్,కోరాడ బాబు, కార్పొరేటర్లు జిజ్జువరపు విజయనిర్మల,పొలిమేర దాసు,సుంకర చంద్రశేఖర్ , కత్తిరి రామ్మోహన్, దేవరకొండ శ్రీనివాస్, సబ్బన శ్రీనివాస్, జయకర్, కడవ కొల్లు సాంబా, గునిపూడి శ్రీనివాస్, ఇనపనూరి కేదారేశ్వరీ,లీగల్ సెల్ నాయకులు ఆచంట వెంకటేశ్వరరావు,దొంగ రామాంజనేయులు,ప్రత్తిపాటి తంబీ, వైఎస్సార్ సిపి నాయకులు కిలాడి దుర్గారావు, మట్టా రాజు, పొలిమేర హరికృష్ణ, నున్న కిషోర్, ఆరేపల్లి సత్తిబాబు, 47వ డివిజన్ ప్రెసిడెంట్ కొల్లి నాగేశ్వరరావు,పల్లి శ్రీను, అత్తులూరి ఉదయేశ్వర రావు, సుల్తానా,అమీనా అన్సారీ, కొత్తపల్లి రాణి,రేష్మ, బీరపోగు సరితా,బోగిశెట్టి పార్వతి, తిప్పాని మణి,బచ్చు విజయలక్ష్మి,బండారు కిరణ్, ఇనపనూరి జగదీష్, జంగం నారాయణ,దాసరి రమేష్, పొడిపిరెడ్డి నాగేశ్వరరావు, శివరావు, మజ్జి కాంతారావు, ఎల్లపు మోజెస్, కొప్పుల ప్రభాకర్ రెడ్డి, తోటకూర కిషోర్, లూటుకుర్తి సుభాష్,ఇంజినీర్ శంకర్,పిట్టా ధనుంజయ్, భారతి వెంకటరావు,16వ డివిజన్ అధ్యక్షుడు నాగళ్ల కొండ, కొండేటి పోతురాజు, సింగవరపు వెంకటేశ్వర రావు, మెరుగు నాని బాబు, ఏమ్మార్వో సోమ శేఖర్,కార్పొరేషన్ ఎలక్ట్రికల్ ఏఈ శేషగిరిరావు, ప్రాజెక్ట్ అధికారి కృష్ణ మూర్తి, రెవెన్యూ అధికారి షాహీలా,డి ఈ కొండలరావు సహా పలు శాఖల అధికారులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు 41,42 సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.