నాసా కిట్లను విద్యార్థులకు అందజేత
1 min readపల్లెవెలుగు, వెబ్ నంద్యాల: విద్యార్థులు పట్టుదలతో చదివి మేధస్సుతో వయసుకు సంబంధము లేకుండా పిల్లలు శాస్త్రీయ విజ్ఞానాన్ని సాంకేతికతను పెంపొందింప చేసుకుంటూ గొప్ప శాస్త్రవేత్తలు కావాలని చిన్నతనము లోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీ చైతన్య పాఠశాల ఆర్ ఐ చౌదరి గారు సూచించారు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాల ఎన్జీవోస్ కాలనీ N3 నందు చదువుతున్న విద్యార్థులకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన నాసా కిట్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి మౌలాబీ గారి అధ్యక్షతన విద్యార్థులకు అందజేశారు ట. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నాసాకిట్ల ద్వారా కొత్త ప్రాజెక్టులను తయారు చేయాలని విద్యార్థులు అసాధారణ ఆలోచనలతో ఏకంగా నాసా దృష్టిని ఆకర్షించే విధంగా తయారు కావాలని అద్భుతమైన ప్రాజెక్టు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగార్జున్ రెడ్డి గారు, డీన్ శాలుమియా గారు, నాసా ఇంచార్జ్ హుస్సేన్స్సా గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.