ఆంధ్ర హాస్పిటల్స్ లో 24వ ఉచిత పిల్లల గుండె సర్జరీలు
1 min readపల్లెవెలుగు, వెబ్ విజయవాడ: విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో హీలింగ్ లిటిల్ ఆర్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో 24వ ఉచిత పిల్లల గుండె సర్జరీలు క్యాంపు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 05వ తేదీ వరకు జరుగుతాయని డా// పి,వి, రామారావు చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ శుక్రవారం హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర హాస్పటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి ఇప్పటివరకు 24 సార్లు ఆంధ్ర హాస్పిటల్స్ కు వచ్చె పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేశామని దీనికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్వీన్స్ ల్యాండ్ చిల్డ్రన్ హాస్పిటల్ లండన్ నుంచి ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేశారని మున్ముందు కూడా ఈ రకమైన గుండె ఆపరేషన్లు ప్రతి నెలకు ఒకసారి ఆంధ్ర హాస్పిటల్స్ కు వచ్చి చేయుచున్నారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అత్యధిక పిల్లల కార్డియాక్ సర్జరీలు నెలకు 50 ఆపరేషన్ చొప్పున సంవత్సరానికి 600 పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్నాంఅని, ఇప్పటివరకు 2800 ఆపరేషన్లు మరియు ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేసామని చెప్పారు. .ఆంధ్ర హాస్పిటల్స్ లో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కార్డియాక్ టీం అండ్ కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ టీం సహకారంతో ప్రతిరోజు గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. పిల్లల గుండె జబ్బులు ఉన్నవారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి మన హాస్పటల్ వస్తున్నారని, ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్ర హాస్పిటల్స్ మరియు హీలింగ్ లిటిల్ యూకే డాక్టర్లు మరియు నర్సులు, వైద్య బృందం నీకి కృతజ్ఞతలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో పిల్లల గుండె జబ్బుల వైద్యం నిపుణులు డాక్టర్ దిలీప్ ,గుండె సర్జన్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ నుంచి డాక్టర్ ప్రేమ్ వేణుగోపాల్, డాక్టర్ సరఫ్ రాజ్ రెహమాన్, డాక్టర్ మహమూద్, సౌమ్య రాజేంద్రన్ తదితరులు పిల్లల తల్లిదండ్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.