అపాయం నుండి కాపాడమే విలేజ్ క్లినిక్ లక్ష్యం
1 min readపల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: గ్రామాల్లోనే ప్రజలకు ప్రాథమిక చికిత్స అందించి రోగిని అపాయం నుండి కాపాడడమే విలేజ్ క్లినిక్ లక్ష్యమని వైద్యాధికారి గాయత్రి తెలిపారు. రుద్రవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్దకంబలూరు గ్రామంలో శుక్రవారం వైయస్సార్ విలేజ్ క్లినిక్ శిబిరం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి గాయత్రి మాట్లాడుతూ ప్రధానంగా గ్రామంలోనే చిన్న చిన్న సమస్యలకు చికిత్సలు నిర్వహించి పెద్ద సమస్యల కొరకు రెఫరల్ పాయింటుగా పనిచేయడం జరుగుతుందన్నారు. బీపీ షుగర్ సీజనల్ చిన్నారులకు గర్భవతులకు బాలింతలకు వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఇళ్ల వద్ద మంచంపై ఉన్న రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశామన్నారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారుల ఆరోగ్యంపై చిన్నారులకు గర్భవతులకు బాలింతలకు అందించ పౌష్టికాహారం పై ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. ఎంపీపీ పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రత తీసుకోవాల్సిన పౌష్టికాహారం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించమన్నారు. విలేజ్ క్లినిక్ ద్వారా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని గ్రామంలో చిన్న చిన్న సమస్యలకు నిత్యం వైద్య పరీక్షలు అందించడం జరుగుతుందని గ్రామస్తులకు వివరించామన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎల్పిహెచ్ శాంతి ఎంపీహెచ్ఈఓ నాగప్రసాద్ హెల్త్ సూపర్వైజర్ యోగేశ్వరయ్య డేటా ఆపరేటర్ ప్రశాంత్ ఏఎన్ఎం లక్ష్మి వైద్య సిబ్బంది 104 సిబ్బంది ఆశా వర్కర్లు ఉపాధ్యాయులు అంగన్వాడి సిబ్బంది విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.