అమాయకులకు వల..!
1 min read– వేలకు లక్షలు ఇస్తామంటూ మోసం ..న్యాయం చేయాలంటున్న బాధితులు.
పల్లెవెలుగు , వెబ్ పాణ్యం: పాణ్యం నియోజకవర్గం. అమాయకులను టార్గెట్ చేస్తూ ఒక్కసారి కొంత మొత్తం చెల్లిస్తే మూడు నెలల్లో లక్షలు ఇస్తామంటూ చెక్కులిచ్చి నమ్మబలికి మోసం చేస్తున్న వైనం వెలుగులో వచ్చింది దాదాపు జిల్లా వ్యాప్తంగా బాధితులు 16,500 ప్రకారం ఆపై చెల్లింపులు చేసి న్యాయం జరగక లబోదిబోమంటున్నారు గడివేముల మండలంలోని బిలకల గూడూరు గ్రామానికి చెందిన 9 మంది బాధితులు డబ్బులు చెల్లించి రెండు నెలలు అవుతున్న డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని కష్టపడిన సొమ్ము దాచుకున్న సొమ్మును ఇచ్చామని వాపోయారు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆఫ్రిన్ అనే మహిళ వేంపెంటకు చెందిన ఒక వ్యక్తితో కలిసి మోసం చేసినట్టు బాధితులు తెలిపారు డబ్బులు అడిగితే ఎస్సీ కేసు పెడతానని బెదిరిస్తుందని సదరు జిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యపాత్ర వహిస్తున్నట్టు పోలీసులు తమను ఏమి చేయలేరని తమకు ఉన్నతాధికారులు తెలుసని పేర్లు చెప్పి బెదిరిస్తున్నారని వాపోయారు శుక్రవారం నాడు కర్నూల్ మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఎస్ ఎస్ వీ మాక్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూల్ పేరుతో తాము చెల్లించిన డబ్బులకు ఓచర్ ఇచ్చినట్టు ఆపై తమకు నాలుగు లక్షల రూపాయల చెక్ ఇచ్చారని సదరు బాధితులు వాపోయారు జిల్లావ్యాప్తంగా కాకుండా వీరి మూలాలు రాష్ట్రాలలో పరిధి దాటి మోసం చేసినట్టు విశ్వసనీయ సమాచారం ఇప్పటికైనా పోలీసు అధికారులు నిష్పక్షపాతిక విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.