గోనెగండ్లలో పర్యటించిన సబ్ కలెక్టర్
1 min read– సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం..
పల్లెవెలుగు, వెబ్ గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్ల మండలంలో పర్యటనలో బైలుప్పల గ్రామంలోని గ్రామ సచివాలయం ను ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.సచివాలయంలో రికార్డులు పరిసిలించి సిబ్బంది తో మాట్లాడారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి శాఖ కార్యాలయం నందు మండల పరిధిలో ఉన్న సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు గురించి సచివాలయాల వారీగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పథకానికి లబ్ధిదారులు ఎందుకు ముందుకు రావడం లేదని వారు అధికారులను నిలదీశారు..జగనన్న కాలనీలో కనీస మౌలిక వసతులు లేవని, కొందరు ప్రభుత్వం ఇచ్చే 1,80,000 ఏమాత్రం సరిపోవడం లేదని, మరికొందరు వలసలకు వెళ్తున్నారని సచివాలయ సిబ్బంది సబ్ కలెక్టర్ కు వివరించే ప్రయత్నం చేశారు. త్వరగా గృహ నిర్మాణాలు చేపట్టుకునేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్ లో చొరవ చూపాలని లబ్ధిదారులను అవగాహన కల్పించాలని వారు పేర్కొన్నారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఉద్దేశించి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, తాసిల్దార్ వేణుగోపాల్, హౌసింగ్ ఏఈ లక్ష్మణ, వివిధ శాఖల అధికారులు మండలంలోని గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.