నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: స్టాక్ మార్కెట్లోని ఇండెక్స్ లు భారీ నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగారు. ఫలితంగా ఆసియా మార్కెట్లు కూడ నష్టాల్లో కదులుతున్నాయి. ఈనేపథ్యంలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లు భారీ గ్యాప్ డౌన్ తో ట్రేడింగ్ ప్రారంభించాయి. భారత్లో గుర్తించబడ్డ కరోన వైరస్ వేరియంట్ ప్రపంచానికి పెనుముప్పుగా మారే అవకాశం ఉందన్న ప్రపంచ ఆరోగ్యం సంస్థ హెచ్చరికతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఉదయం 10:40 నిమిషాల సమయంలో నిఫ్టీ- 102 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుండగా..బ్యాంక్ నిఫ్టీ – 318 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. కరోన కేసులు సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. మార్కెట్లో జోరు కొనసాగింది. నాలుగురోజుల పాటు మార్కెట్లో కొనసాగిన జోరుకు ఈరోజు బ్రేక్ పడిందని చెప్పవచ్చు.