PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హరి హరులకు ప్రీతికరం కార్తిక మాసం

1 min read

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: సృష్టిలో అనంతమైన జీవకోటిలో బుద్ధి శక్తి కలిగిన జీవి మానవుడేనని, అటువంటి మానవ జన్మకు సార్థకత, సరైన మార్గంలో నడిచి, సర్వభూత హితం కలిగినపుడే నని ఇస్కాన్ కర్నూలు బాధ్యులు శ్రీ రఘునందన దాస్ జీ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని శ్రీ లలితా పీఠం నందు జరుగుతున్న కార్తీక మాస ధార్మిక సప్తాహ‌‌‌ కార్యక్రమంలో భాగంగా ఐదవరోజు వారు ముఖ్య అతిథిగా ఆశీఃప్రసంగం చేశారు. ముఖ్య వక్తగా హాజరైన ఎన్.వరలక్ష్మీదేవి కార్తీక మాస విశిష్టత గురించి, ఏకాదశి, ద్వాదశి రోజులకున్న విశిష్టత గురించి సోదాహరణంగా వివరించారు. ఈ మాసం హరిహరులకు ప్రీతికరమైన మాసమని, కార్తీక మాసంలో వచ్చే ప్రతి రోజుకు విశిష్టత ఉన్నదని వివరించారు. పదిహేడవ వార్డు కార్పోరేటర్ కె.వి.పద్మలతా రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు చేస్తున్న ధార్మిక సేవలను కొనియాడారు. లలితా పీఠం ఆధ్వర్యంలో తులసి మొక్కలపంపిణీ మరియుగోపూజలు కార్తీక ద్వాదశిని పురస్కరించుకుని లలితా పీఠం ఆధ్వర్యంలో భక్తులకు తులసిమొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ పద్మలతారెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని సమతుల్యంగా ఉంచగలిగే శక్తి గోవుకు మరియు తులసికి ఉన్నదని, అటువంటి తులసిని గోజాతిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భక్తులందరూ కలిసి గోపూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లలితా పీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ రాయలసీమ క్లస్టర్ ఇంచార్జి ఇ.డిల్లీరెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ధార్మిక ప్రవచకులు, హరీబేల్ సీతా మహాలక్ష్మి, రిటైర్డ్ మండల విద్యాధికారి ఇల్లూరి నాగరత్నం శ్రేష్టి, డాక్టర్ వీపూరి వేంకటేశ్వర్లు, శ్రీలక్ష్మి విద్యాసంస్థల అధినేత శ్రావ్యాకార్తిక్, అర్చకులు మామిళ్ళపల్లి జగన్మోహన శర్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author