చంద్రబాబు కాన్వాయ్ పై .. రాళ్లదాడి పిరికిపంద చర్య
1 min read– రౌడీ రాజ్యానికి ప్రజలు చరమగీతం పాడడం తధ్యం.
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై వైసీపీ మూకల రాళ్ల దాడి పిరికిపంద చర్య అని టిడిపి నందికొట్కూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకట స్వామి అన్నారు. టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ల దాడినీ తీవ్రంగా ఆయన ఖండించారు.శనివారం దాడికి నిరసనగా కాకరవాడ చిన్న వెంకట స్వామి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు ,కార్యకర్తలు నందికొట్కూరు పట్టణంలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు టిడిపిని బలపరిచి చంద్రబాబు నాయుడు కు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఓర్వలేక జగన్ రెడ్డి ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతుందన్నారు. నందిగామ బాదుడే-బాదుడు రోడ్ షోలో జన సందోహం మధ్య ప్రజల ఉద్దేశించి ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు పై వైసీపీ గుండాలు రాళ్ల దాడి చేయడంతో చీప్ సెక్యూరిటీ అధికారుల కు గాయాలు అయ్యాయన్నారు. గతంలో జగన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి పై రాళ్ల దాడి చేయించారని, అదే రౌడీ, గుండాల సంస్కృతి ఇప్పుడు జగన్ రెడ్డి కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రౌడీ రాజ్యం నుండి రాక్షస పాలన నుండి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని 2024 లో చంద్రాబాబు నాయుడు నాయకత్వం లో ప్రజాస్వామ్య పాలన వస్తుందని, ప్రజలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును గెలిపించి ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అంబెడ్కర్ ఆశయాలు అమలుజరుగుతాయని, రౌడీ పాలన అంతం అవుతుందని అన్నారు. వైసీపీ రౌడీ రాజ్యానికి ప్రజలు చరమగీతం పాడడం తథ్యమన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేష్ నాయుడు , మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్, ఐటీడిపి అధ్యక్షుల ముర్తుజావలి, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు జాకీర్ హుస్సేన్, ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ స్వామి జూపల్లి, మైనారిటీ సెల్ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఖాద్రి, ఇదృష్, వార్డ్ కన్వీనర్లు కళాకర్, ఎస్సీ సెల్ నాయకులు రాజన్న, రగడ ప్రవీణ్, తెలుగు యువత నాయకులు కుమార్, మధు, బ్రహ్మయ్య , రవి చౌదరి, సతీష్,మట్ట, చాంద్,మండలాల టిడిపి నాయకులు శేఖర్, రమణారెడ్డి,నారాయణ రెడ్డి, శివ శంకర్, ఇంతియాజ్, కార్యకర్తలు పాల్గొన్నారు.