ఇఫ్కోలో డిగ్రీతో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా.. అసిస్టెంట్ ట్రైనీ (ఆపరేటర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. దీని కోసం అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు 13 నవంబర్ 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి కెమికల్ ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా.. ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్ స్పెషలైజేషన్‌లో B.Sc ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారులు ఫర్టిలైజర్/ హెవీ కెమికల్ ఇండస్ట్రీ/ పెట్రోలియం రిఫైనరీ/ పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తుల చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది . ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.31,000 నుంచి రూ.64,000 వరకు వేతనం చెల్లించనున్నారు.
ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది . ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.31,000 నుంచి రూ.64,000 వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు ఒడిషా రాష్ట్రంలో పని చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు 13 నవంబర్ 2022 లోపు అధికారిక వెబ్‌సైట్ www.iffco.in/en/corporateని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.