PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాంక్ ఆఫ్​ బరోడాలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : నిరుద్యోగులకు ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీ ప్రొఫెషనల్స్ విభాగంలో వివిధ ఖాళీల భర్తీకి ఈ నియామకాలను చేపట్టింది బ్యాంక్. మొత్తం 60 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే.. కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలను చేపట్టినట్లు బ్యాంక్ తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

About Author