PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

51,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం..

1 min read

– కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఉండవు
– కలెక్టర్​ ఎస్​. వెంకటరావు
పల్లెవెలుగువెబ్​, మహబూబ్​నగర్​ : యాసంగి పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని, మద్దతు ధరతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్​ ఎస్​. వెంకటరావు అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 51,177.750 మెట్రిక్​ టన్నులు కొనుగోలు చేసినట్లు కలెక్టర్​ వెల్లడించారు. మంగళవారం ఆయన మూసాపేట మండలం కొమిరెడ్డి పల్లి గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 190 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి, 188 కేంద్రాలను ప్రారంభించామని, 8722 మంది రైతుల ద్వారా ఇప్పటివరకు 12420 .300 మెట్రిక్ టన్నుల సన్నరకం,38666 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 91.400 మెట్రిక్ టన్నుల సాధారణ రకం, మొత్తం కలిపి 5117.7507 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్​ ఎస్​. వెంకటరావు వివరించారు. ఇందులో ఐకేపీ ద్వారా 113 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 22460 మెట్రిక్ టన్నుల దాన్యాన్ని ,పిఎసిఎస్ ద్వారా 68 దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 27147 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని,మెప్మా ద్వారా ఒక దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 721 మెట్రిక్ టన్నులు,ఏ ఎం సి ద్వారా నాలుగు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 805 మెట్రిక్ టన్నుల ధాన్యం,డి సి ఎం ఎస్ ద్వారా2 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 42 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన 51177.750 మెట్రిక్ టన్నుల ధాన్యములు లో 40221.500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు కలెక్టర్ వెల్లడించారు.ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

About Author