మల్లన్న నీ భక్తులకు ప్రదక్షిణ కరువాయే
1 min read– తిరుమలలో లేని ఆంక్షలు శ్రీశైల క్షేత్రంలో ఎందుకని భక్తులు వాపోతున్నారు
– తిరుమల క్షేత్రంలో ఆలయ వెలుపల ప్రదక్షిణ చేసుకుందానికి అవకాశం ఉంది
– శ్రీశైల క్షేత్రంలో అవకాశం ఉండి కూడా పెద్ద పెద్ద గేట్లు వేసిన అధికారులు
– ఆలయ ప్రదక్షిణ విషయమై ఈవో దృష్టికి తీసుకు వెళ్లిన కొద్దిరోజులకి పరిమితమైన ఈవో మాట
పల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం: శ్రీశైల ఆలయంలో ప్రదక్షణ చేసుకునే దానికి గతంలో అవకాశం ఉండేది ప్రస్తుతం ప్రదక్షణ చేసుకునే దానికి భక్తులు పెరగటంతో అవకాశం లేకుండా పోయింది ఆలయంలోపల లేకున్నా శివ మాడ. వీధులు లో నైనా ప్రదక్షణ చేసుకునే అవకాశంలేకుండా పోయిందని ఏక్కడ చూసిన మాడవీధుల్లో పెద్ద గేట్లు వేశారని భక్తులు వాపోతున్నారు .ఆలయ ప్రదక్షణ విషయము ఈవో దృష్టికి తీసుకువెళ్తే భక్తుల సౌకర్యం కోసం మాడవీధులు అడ్డంగా ఉన్న గేట్లని తీసే దానికి చర్యలు తీసుకున్నారు ఆలయ అధికారులు మాత్రం కొద్ది రోజులకు మాత్రమే యధావిధిగా గేట్లు మూసివేశారు భక్తులకు ఆలయ ప్రదక్షణ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది దీనివలన ఆలయ అధికారుల పనితీరుపై విమర్శలు వెళ్లి విరుస్తున్నాయి ఏ భక్తుడైన ఆలయానికి వెళితే కచ్చితంగా ఆలయ ప్రదక్షిణ చేసుకోవడానికి భావిస్తాడు ఈ అవకాశం శ్రీశైలంలో అధికారులు కల్పించడం లేదు తిరుమల మహా క్షేత్రంలోని రోజుకు భక్తులు లక్ష మంది దర్శించుకుని భక్తులు మాడవీధుల లో ప్రదక్షిణ చేస్తుంటారు కానీ శ్రీశైలం మహా క్షేత్రంలో లక్షల రూపాయలతో వెచ్చించి శివ మాడవీధులను ఏర్పాటు చేశారు కానీ దేవస్థానం అధికారులు భక్తులకు అనుమతి లేకుండా చేశారు మల్లన్న భక్తులకు ప్రదక్షణ చేసుకునే మొక్కు తీర్చుకుందాం అనుకుంటారు కానీ శ్రీశైల మహా క్షేత్రంలో ప్రదక్షణ చేసుకుని దానికి అవకాశం లేకుండా అధికారులు ఎక్కడ చూసిన మాడవీధుల చుట్టూ పెద్ద గేట్లు వేసి భక్తులకు ప్రదక్షిణ లేకుండా చేశారు మరియు కోట గోడ మీద ఉన్న చారిత్రక శిల్ప ఆకృతులను చూడకుండా ఆలయ అధికారులు చేస్తున్నారని భక్తులు అంటున్నారు రోజుకు లక్షలలో దర్శించుకున్న తిరుమల మాడవీధుల్లో ప్రదక్షణ చేసుకునే అవకాశం ఉంది కానీ శ్రీశైల మహా క్షేత్రంలో అవకాశం లేకుండా చేస్తున్న అధికారులు ప్రదక్షణ చేసుకొనే దానికి తిరుమలలో లేని ఆంక్షలు మల్లన్న భక్తులకు ఎందుకు అని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్ణయం తీసుకుని భక్తులకు మాడవీధుల్లో ప్రదక్షిణ చేసుకునే అవకాశం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.