PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశానికె ఆదర్శం ప్రజా సంకల్ప యాత్ర

1 min read

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి 5 సంవత్సరాల అయిన సందర్బంగా కర్నూలు జిల్లా వైస్సార్సీపీ కార్యాలయంలో మరియు వైస్సార్ సర్కిల్ నందు ఘనంగా వేడుకలు నిర్వహించిన వైస్సార్సీపీ శ్రేణులు వైస్సార్ సర్కిల్ లో వైస్సార్ విగ్రహంకు పూలమాల వేసిన కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ గారు మరియు నగర మేయర్ బీవై రామయ్య గారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ప్రజా ప్రతినిధులు కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ గారు మరియు బీవై రామయ్య గారు… ఈ విధంగా వారు మాట్లాడుతూ2017లో ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర.. ఇచ్ఛాపురంతో ముగింపు. 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాల్లో.. 2,516 గ్రామాల్లో.. 124 బహిరంగ సభలతో.. 55 ఆత్మీయ సమ్మేళనాలతో దాదాపు రెండు కోట్లమంది ప్రజలతో మమేకం.ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం వరకు ప్రస్థానం341 రోజులు.. 3,648 కిలోమీటర్లు నడకప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ సాగిన యాత్ర341 రోజులు.. 3,648 కిలోమీటర్లు.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. నవరత్నాలు ప్రజల్లోకి తీసుకెళుతూ.. ప్రజా సంకల్పమంటూ ముందుకు సాగారు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. మొత్తం 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాల్లో.. 2,516 గ్రామాల్లో.. 124 బహిరంగ సభలతో.. 55 ఆత్మీయ సమ్మేళనాలతో దాదాపు రెండు కోట్లమంది ప్రజలతో మమేకమయ్యారు. ఇలా 2017లో ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర.. ఇచ్ఛాపురంతో ముగింపు (09-01-2019)దశకు చేరింది ప్రజలు కష్టం తెలుసుకొని నేడు అ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీనీ ఏ ఒక్కటి మరవకుండా ప్రతిది నెరవేరుస్తూ మహాత్మ గాంధీ గారి కళలను సాకారం చేసి సచివాలయం వ్యవస్థతో సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజలకు లబ్ధిదారులకు అందే విధంగా రూపుదిద్దడమే కాకుండా కష్టం ఉన్న ప్రతిఒక్కరికి బాసటగా నిలుస్తూ దేశానికె ఆదర్శవంతమైన పాలన చేస్తున్న నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

About Author