నగరవనాన్ని సందర్శించండి : జిల్లా కలెక్టర్
1 min readగార్గేయపురం సమీపంలోని నగరవనాన్ని సందర్శించిన కలెక్టర్ జిల్లా అధికారులు
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు : గార్గేయపురం సమీపంలో ఆహ్లాదకరంగా ఉన్న నగరవనాన్ని సందర్శించాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు కర్నూలు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సోమవారం ఉదయం కర్నూలు రూరల్ మండలం, గార్గేయ పురానికి సమీపంలో ఉన్న నగరవనాన్ని అటవీ సంరక్షణ అధికారి పి రామకృష్ణతో కలిసి కలెక్టర్, జిల్లా అధికారులు సందర్శించారు. నగరవనంలోని పిల్లిగుండు ప్రదేశం, యోగా శిక్షణ కేంద్రం, వాచ్ టవర్, పిల్లల ఆటస్థలం, ఐదు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఏపీ టూరిజం బోటింగ్, నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ప్రకృతి వనాలను కలెక్టర్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా అటవీ వృక్షాలు నారేపి, సోమి, నీరుద్ధి తదితర వృక్షాలు, వివిధ రకాల అటవీ జంతువులు,,పక్షుల వివరాలను జిల్లా అటవీశాఖ అధికారి శివశంకర్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. నగర వనం పచ్చని చెట్లతో ఆహ్లాద కరమైన వాతావరణం కలిగి ఉందని, పిల్లలకు, పెద్దలకు కూడా నగర వనం సందర్శన మంచి అనుభూతి కలిగిస్తుందని, నగర ప్రజలు సందర్శించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నగర వనాన్ని నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగేశ్వరరావు డీఎఫ్ఓ శివశంకర్ రెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సూర్యచంద్రరాజు శ్రీనివాస్ గౌడ్ లతోపాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.