PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిన్న రాజుపాలెం గ్రామంలో పశువైద్య శిబిరం

1 min read

పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : మండలం చిన్నరాజుపాలెం గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి మరియు పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ పశువైద్య శిబిరంలో వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేశారు. తర్వాత గ్రామంలోని దూడలకు బృసెల్లా వ్యాధి నివారణ టీకాలు వేశారు. అనంతరం వైయస్సార్ సంచార పశువాగ్యసేవ వాహనం గురించి పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు మానసవీణ, పసుపల సర్పంచ్ మోహన్ బాబు, చిన్న రాజుపాలెం తాండ సర్పంచ్ రమేష్ నాయక్, పశువైద్యులు డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి, డాక్టర్ తస్లిమ, కేవికే శాస్త్రవేత్త కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

About Author