PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దస్తగిరి స్వామికి ప్రత్యేక ఫాతెహాలు

1 min read

– దస్తగిరి స్వామికి ఫాతెహాలు సమర్పిస్తున్న తెదేపా నాయకులు
పల్లెవెలుగు , వెబ్ చాగలమర్రి : చాగలమర్రి పట్టణంలోని కోటగడ్డ వీధిలో వెలసిన దస్తగిరిస్వామికి సోమవారం తెదేపా నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు . తెదేపా రాష్ట్ర మైనార్టిసెల్ ఉపాధ్యక్షులు అన్సర్బషా ఆధ్వర్యంలో స్థానిక దర్గాలో ప్రత్యేక పాతెహాలు సమర్పించారు . రాబోయే రోజుల్లో తెదేపా అధికారం చేపట్టాలని వారు కోరుకున్నారు . కార్యక్రమంలో నంద్యాల బీసీసెల్ స్పోక్ పర్సన్ సల్లానాగరాజు , టీఎన్టీయూసీ కార్యదర్శి గుత్తినరసింహులు , నాయకులు కొలిమి ఉసేన్వలి , కొలిమి షరీఫ్ , అలంసాగారి మౌలాలి , హనీఫ్ కింగ్ ఉసేన్ , బషీర్ , ఓబులేసు పాల్గొన్నారు .

About Author