PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫేస్ 2 నాడు నేడు పనుల పరిశీలన

1 min read

కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని KVR ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో ఫేస్ 2 క్రింద నాడు నేడు పనులను పరిశీలించిన కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు,అదేవిధంగా KVR కళాశాల ప్రభుత్వ భూమి 13 ఎకరాలలో KVR జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల వుంది ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో హాస్టల్ వసతి లేదు అలాగే ఇద్దరు ప్రిన్సిపల్ సమస్య కారణంగా విద్యార్థినిలు ఇబ్బంది పడుతున్నారని ఈ సందర్భంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఇరువురిని కూర్చోబెట్టి A.P హైకోర్టు ఆదేశాల ప్రకారము, Seciad clied recoctory of Higher Education, A.P. వారి memo ప్రకారం కర్నూలుజిల్లా కలెక్టరు గారు 14 Perrnovent stucchirus తో సహా రెండు ఎకరములు స్థలమును కేటాయించారు. ప్రస్తుత కలెక్టర్ శ్రీ. P. కోటేశ్వర్ రావ్ గారు జూనియర్ కళాశాలకు 14 Permanent struclines ను ఖాళీ చేసి అప్పగించ మని ఆదేశాలు జారీ చేశారు కావున ఇద్దరు ప్రిన్సిపల్ లు అంగీకారంతో సమస్యను పరిష్కారం చేసుకొని కాలేజీ అభివృద్ధికి కృషి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు నేడు క్రింద కార్పొరేట్ స్కూలు కాలేజీల దీటుగా ఉండాలని ముఖ్యమంత్రి గారు వేలకోట్లు పెడుతున్నారని ఎంపీ గారు తెలిపారు.జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారులు,ఎడ్యుకేషన్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తానని మీరు సమన్వయంతో పని చేసి విద్యార్థినిల సమస్య పరిష్కారం చేయాలిని ఎంపీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపల్ చెన్నయ్య, బీసీ నాయకులు మధుసూదన్, లక్ష్మీకాంతయ్య, ధనుంజయ ఆచారి,జూనియర్ డిగ్రీ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author