అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవ కార్యక్రమం
1 min read– అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఆసుపత్రిలో ఒకప్పుడు ఎక్సరే మరియు స్కానింగ్ కోసం మరుసటి రోజు రిపోర్టులు వచ్చేటివి అలాంటి పరిస్థితికి ఇప్పుడు స్వస్తి పలికారు అంతరం పేషంట్లకు ఇబ్బంది కలగకుండా ఎక్సరే మరియు స్కానింగ్ తీసిన ఒక వన్ అవర్ వ్యవధిలోనే ఫిలిమ్స్ మరియు రిపోర్ట్స్ అందజేస్తున్నాము దీని ద్వారా పేషెంట్లకు తత్వరా ట్రీట్మెంట్ అందనున్నట్లు తెలిపారు అనంతరం రేడియాలజీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.రేడియాలజీ విభాగానికి అత్యాధునిక టెక్నాలజీ కల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి రేడియాలజీ విభాగానికి ఎలాంటి సాయ సహకారాలు కావాలన్న వారికి చేయడానికి సిద్ధమేని తెలిపారు అనంతరం ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయడానికి మరింతగా కృషి చేయనున్నట్లు తెలిపారు.రేడియాలజీ సిబ్బంది మరింత బాగా కష్టపడి ఆసుపత్రికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల అడిషనల్ DME& ప్రిన్సిపాల్, డా. సుధాకర్, ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, రేడియాలజీ విభాగాధిపతి డా.రాధా రాణి, మరియు అసిస్టెంట్స్ వైద్యులు మరియు రేడియాల టెక్నీషియన్స్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు తెలిపారు.