PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశానికి.. ఊపిరినిస్తాం..

1 min read

– ‘కోవిడ్​’ బాధితులకు ఉచితంగా ఆక్సిజన్​ సరఫరా
– జిందాల్​ చీఫ్​ మెయింటెనెన్స్​ ఆఫీసర్​ వీరబాబు
పల్లెవెలుగువెబ్​, గడివేముల : దేశంలో కరోన కరాళ నృత్యం చేస్తోందని, కోవిడ్​ బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహకారం పూర్తిస్థాయిలో అందిస్తామని జిందాల్​ పరిశ్రమ చీఫ్​ మెయింటెనెన్స్​ ఆఫీసర్​ వీరబాబు హామీ ఇచ్చారు. జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్ ఒడిశాలోని అంగుల్‌లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి ఏపీకి ట్యాంకర్‌ ద్వారా రోజూ 20 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్లు 278 ఏర్పాటు చేస్తున్నామని, ఏపీలోని వివిధ ఆస్పత్రులకు 62 ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్లు కేటాయిస్తామన్నారు. అందులో కర్నూలు జిల్లాకు 10 ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఆక్సిజన్​ కొరత తీరేంత వరకు ఆక్సిజన్​ను ఉచితంగా సరఫరా చేస్తామని వెల్లడించారు.

ఆక్సిజన్​ ఉత్పత్తి…: దేశవ్యాప్తంగా స్టీల్ ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నామని జిందాల్​ చీఫ్​ మెయింటెనెన్స్​ ఆఫీసర్​ వీరబాబు తెలిపారు. విజయనగరం, బళ్ళారి, ఒడిస్సా, బిపీఎస్ఎల్. హోస్పేట్ బీ ఏం ఏం. చత్తీస్గడ్. డోల్వి ముంబై. సేలం తమిళనాడు. ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్నట్టు ఒక్క విజయనగర ప్లాంట్ నుంచి 700 మెట్రిక్ టన్నులు దేశ వ్యాప్తంగా 1300 నుంచి 1400 మెట్రిక్ టన్నులు మెడికల్ ఆక్సిజన్ను వివిధ ఆసుపత్రులకు ఉచితంగా ఇస్తున్నట్టు తెలిపారు.
ఎమ్మెల్యే, కలెక్టర్​ విజ్ఞప్తి మేరకు…: పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , కలెక్టర్ వీర పాండ్యన్ విజ్ఞప్తి మేరకు జిల్లాకు ఉచితంగా ఆక్సిజన్​ సరఫరా చేస్తున్నామన్నారు. వ్యాపారంలో వచ్చే లాభాలను ఎన్జీవోస్​ ద్వారా సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిందాల్​ చీఫ్​ మెయింటెనెన్స్​ ఆఫీసర్​ వీరబాబు వెల్లడించారు. దత్తత గ్రామాలో మహిళల అభ్యున్నతి కోసం టైలరింగ్ , జ్యూట్ బ్యాగ్స్ శిక్షణ కేంద్రాలను నడుపుతున్నామని, గర్భిణులు, బాలింతల కు పౌష్టికాహారం, వైద్య సహాయం అందిస్తున్నాం. దత్తత గ్రామాలలో హైపో ద్రావణం పిచికారీ క్లోరినేషన్ ఫాగ్గింగ్ చేస్తున్నాం. ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ అవసరం ఉన్నవారికి ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ సాంబశివరావు, సి.ఎస్.ఆర్ మేనేజర్ రవి కుమార్ పాల్గొన్నారు.

About Author