స్మార్ట్ ఫోన్ తో ప్రమాదమా ?
1 min readపల్లెవెలుగువెబ్ : స్మార్ట్ ఫోన్లతో గుండె ఆరోగ్యానికి కూడా నష్టం కలుగుతుందని కార్డియాలజిస్టులు హెచ్చరించారు. కేరళ కార్డియాలజిస్టుల సొసైటీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఈ అంశంపై వైద్యులు మాట్లాడారు. అధిక ఒత్తిళ్లు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు గుండె జబ్బులకు కారణమవుతున్నట్టు కేరళ కార్డియాలజీ సొసైటీ ప్రెసిడెంట్ ప్రభానాని గుప్తా పేర్కొన్నారు.
‘‘అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, కదలికలు పెద్దగా లేని జీవనం, స్థూల కాయం, పొగ తాగడం, అధికంగా ఆల్కహాల్ సేవించడం, వ్యాయామం లోపించడం, నిద్రలేమి ఇవన్నీ గుండె జబ్బులకు దారితీసే అంశాలు. ఇప్పుడు అధికంగా స్మార్ట్ ఫోన్ ను వినియోగించడం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో గుండె జబ్బుల రిస్క్ పెరగడం కొత్త రిస్క్’’ అని డాక్టర్ ప్రభానాని తెలిపారు. కనుక స్మార్ట్ ఫోన్ ను పరిమిత సమయం పాటు చూడడమే సమస్యకు పరిష్కారమని వైద్యుల సూచన.