నత్త నడకన భవన నిర్మాణ పనులు
1 min readపల్లెవెలుగు, వెబ్ రుద్రవరం : మండలంలోని ఆలమూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణం పనులు నత్త నడకగా సాగుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరమ్మతుల గురి కావడంతో నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం గత ఏడాది నిధులు మంజూరు చేసింది. పనులు ప్రారంభించిన సదరు కాంట్రాక్టర్ ఏడాది పూర్తయిన నేటికి పూర్తి చేయకపోవడంతో నత్త నడకగా కొనసాగుతున్నాయి. ఆలమూరు ఆరోగ్య కేంద్రం భవనంతో పాటు నరసాపురం గ్రామంలోని ఆరోగ్య కేంద్రం భవనం మరమ్మతులు చుట్టూ ప్రహరీ నిర్మాణం పనులు ఒకేసారి మొదలుపెట్టినా నరసాపురం గ్రామంలో పనులు పూర్తిచేసినా ఆలమూరు ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణం పనుల్లో జాప్యం నెలకొంది. ఈ రెండు పనులు చేపట్టింది కాంట్రాక్టర్ ఒక్కరే ఎందుకు ఇంత ఆలస్యంగా జరుగుతున్నాయని వైద్యాధికారి వినయ్ ని కోరగా పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజనీర్ అధికారులు కాంట్రాక్టర్కు సూచించామన్నారు. ప్రస్తుతం ఉన్న భవనం మరమ్మతులకు గురి కావడంతో స్పందించిన ఉన్నతాధికారులు నూతన భవనం నిర్మించేందుకు గత ఏడాది సుమారు కోటి 30 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు . కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణి కారణంగా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని డిసెంబర్ నెలలోగా పూర్తి చేస్తామని ఇంజనీర్ అధికారి చెప్పడం జరిగిందన్నారు.