ప్రజా సమస్యల పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలం
1 min read– కొట్టేటి హనుమంతరావు
పల్లెవెలుగు, వెబ్ విజయవాడ: తెలుగుదేశం పార్టీ నాయకులు, కేశినేని శివనాథ్ (చిన్ని) గారి కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసి, ప్రజలకు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్ కుచంద్రబాబు నాయుడు ని విమర్శించే స్థాయి లేదని ఆయన అన్నారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో జగన్ ప్రభుత్వ పథకాలు లోపాన్ని ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని ఈ చంద్రబాబు నాయుడు లాంటి ప్రజానాయకుడు పై అవాకులు, చవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన విమర్శించారు. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలు తీవ్ర మైన ఇబ్బందులు పడుతున్నారని, సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ప్రజలకు పూర్తిగా చేరడం లేదని, అనేక నిబంధనలతో వచ్చిన పథకాలను ఆపివేస్తూ ఈ పరిపాలన కొనసాగుతుందని, సంక్షేమ పథకాలను ఆపేసి, ప్రజలపై పన్నుల రూపంలో అదనపు వసూళ్లు చేస్తున్న ఈ జగన్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో కన్నీరు తప్ప ప్రజలకు ఏమి మిగలలేదని, ప్రజల జీవితాలతో చెలగాటమాడే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, పోరాడుతుందని ఆయన తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎవరికి ఏ పథకాలు వచ్చాయో ఎమ్మెల్యే వెల్లంపల్లి సమాధానం చెప్పగలరా, ఎన్ని పథకాలు తొలగించారో మీకు తెలుసా, అవి తెలుసుకొని మా గురించి మాట్లాడనని ఆయన ఎద్దేవా చేశారు. ఊసరవెల్లి లాగా రంగులు మార్చే పార్టీలు మారే నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శిస్తావా సిగ్గుందా ముందు నీ సంగతి తెలుసుకో రాబోయే కాలంలో పశ్చిమ నియోజకవర్గంలో జనం నిన్ను ఎక్కడ ఉంచదలచుకున్నారో మీకు అర్థమవుతుందా అనిఅన్నారు.తెలుగుదేశం పార్టీ మైనారిటీ అర్బన్ మాజీ అధ్యక్షులు ఎస్కే ఇర్ఫాన్ గారు మాట్లాడుతూ, మైనారిటీలను మోసం చేసి, మైనార్టీ ఉద్ధరిస్తామని ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి నువ్వు పెద్ద మోసకారివి అని విమర్శించారు. మైనారిటీ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి మైనార్టీలను పొట్ట కొట్టిన ఈ జగన్ రెడ్డిని మైనార్టీలు కచ్చితంగా బుద్ధి చెప్తారని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 34 డివిజన్ అధ్యక్షులు అట్లూరి కొండలరావు, 7వ డివిజన్ పార్టీ అధ్యక్షులు పడమట సతీష్ చంద్ర, నాయకులు పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.