ఏకసభ్యకమీషన్ రిపోర్ట్ ను త్వరగా ఇవ్వాలి
1 min read– విఆర్పీఎస్ నేత శేఖర్ డిమాండ్
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: వాల్మీకులను ST లుగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నియమించిన rtd ఐ ఏ ఎస్ అధికారి శ్యాంయిల్ ఆనంద్ కుమార్ గారిని వెంటనే కార్యాచరణ చేపట్టి 3 నెలల కాలవ్యవది లోపల ఇచ్చేలా చూడాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి పరమటూరి శేఖర్ ,పట్టణ యువనేతలు బ్రహ్మనాయుడు,బాలనాగన్నలు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు అనగా మంగళవారం సాయంత్రం పొన్నాపురంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో మాట్లాడుతూ వాల్మీకులు దాదాపు 7 దశబ్దాలుగా మేము అధికారంలోకి వస్తే వాల్మీకులను st లుగా పునరుద్దరిస్తామని చెప్పి ఆ తరువాత మోసం చేస్తున్నారని ఇప్పుడున్న ప్రభుత్వమైనా వాల్మీకులకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని వెంటనే ప్రభుత్వం కార్యాచరణ జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ,మాటిచ్చి ఇప్పటికే 3.5 సంవత్సరాలు అయిందని ఇంకా కాలయాపన చేస్తే వాల్మీకుల్లో ఆశలు చన్నగిల్లుతాయని ,ముఖ్యమంత్రి మాటిస్తే తప్పరనే నమ్మకం వాల్మీకుల్లో కలుగుతుందని కచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకుంటే వాల్మీకులు ఈ ప్రభుత్వానికి బ్రహ్మరతం పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు బోయలు ఏ పార్టీలో ఉన్నా మనకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళ వెంట నడిచేందుకు సిద్ధం కావాలని,రాబోవు రోజుల్లో విఆర్పీఎస్ ఏ పిలుపు ఇచ్చిన కదిలి వచ్చే0దుకు సిద్ధంగా ఉండాలని పొన్నాపురం వాల్మీకులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మద్దిలేటి,కేశాలు, రామస్వామి,సుబ్బయ్య,మల్లయ్య,రామయ్య,రాజు,స్వామి తదితరులు పాల్గొన్నారు.