డీఆర్డీవో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) రిక్రూట్మెంట్ చేపట్టింది. సంస్థ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ .. తాజాగా అడ్మిన్ & అలైడ్ కేడర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభమైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్డీవో పరిశోధన కేంద్రాల్లో స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఇతర జాబ్ రోల్స్‌లో 1061 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్సైట్ drdo.gov.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్స్ సమర్పించడానికి గడువు డిసెంబర్ 7తో ముగియనుంది. ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ పాసై ఉండాలి. అలాగే టైపింగ్ స్కిల్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం తప్పనిసరి. అభ్యర్థులను మెరిట్(పర్సెంటేజ్/మార్కులు) ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు చేరే సమయంలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ , నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేయవచ్చు. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం కేటగిరీ అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.