నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు..!
1 min readపల్లెవెలుగు వెబ్: స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి.. నిఫ్టీ- 154 పాయింట్లు నష్టపోయింది. 14,696 వద్ద నిఫ్టీ 50 ఇండెక్స్ ట్రేడ్ ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ- 414 పాయింట్లు నష్టపోయింది. 32,457 వద్ద బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ముగిసింది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కొనసాగుతుండటంతో మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఆసియన్ మార్కెట్లు మిశ్రమంగా కదులుతన్నాయి. యూరోపియన్ మార్కెట్లు కూడ మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. కరోన కేసుల సంఖ్య పెరగడం.. మరణాల సంఖ్య కూడ పెరగడంతో ఇన్వెస్టర్లు కొనుగోలుకు ఆసక్తి చూపడంలేదు.