PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TNRకు అండ‌గా..ప్రముఖ నిర్మాణ సంస్థ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ యాంక‌ర్, న‌టుడు తుమ్మల న‌ర‌సింహారెడ్డి కుటుంబానికి ప్రైమ్ షో నిర్మాణ సంస్థ అండ‌గా నిలిచింది. త‌క్షణ ఖ‌ర్చుల నిమిత్తం ల‌క్ష రూపాయ‌లు స‌హాయం చేసింది. టీఎన్ఆర్ కుటుంబానికి అండ‌గా నిల‌వాల‌నే ఉద్దేశంతో త‌మ‌కు చేతనైన స‌హాయం చేస్తున్నట్టు ప్రైమ్ షో ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ ప్రక‌టించింది. ఈ స‌హాయాన్ని టీఎన్ఆర్ భార్యకు అందించ‌నున్నారు. ఇటీవ‌లే క‌రోన‌తో పోరాడి టీఎన్ఆర్ అసువులు బాసారు. టీఎన్ఆర్ ఎంద‌రో ప్రముఖుల‌ను ఇంట‌ర్వ్యూ చేశారు. త‌క్కువ కాలంలోనే ఇండ‌స్ట్రీలో, జ‌ర్నలిజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

About Author